News June 23, 2024
BIG BREAKING: నీట్ స్కామ్‌పై FIR నమోదు చేసిన సీబీఐ
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై ఇవాళ FIR నమోదు చేశారు. పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు, బిహార్‌లో పేపర్ లీక్‌తోపాటు గ్రేస్ మార్కులు కలపడంపైనా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు.
Similar News
News November 6, 2024
విజయనగరం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు బరిలో ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. అంతకుముందు రఘురాజుపై అనర్హత వేటుతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
News November 6, 2024
వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.
News November 6, 2024
టాప్-10లోకి దూసుకొచ్చిన పంత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఐదు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నారు. యశస్వీ జైస్వాల్ ఒక స్థానం దిగజారి ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-20లో కూడా లేకుండా పోయారు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అశ్విన్ 5, రవీంద్ర జడేజా 6 స్థానాల్లో ఉన్నారు.