News March 30, 2024
BIG BREAKING: వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు

AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.
Similar News
News February 3, 2026
అసభ్యంగా తాకాడు.. చెంపపై ఒక్కటిచ్చా: నటి రేవతి సెన్సేషనల్ కామెంట్స్

80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘11వ తరగతి చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు. అస్సలు భయపడకుండా వెంటనే అతణ్ని అందరి ముందే చెంపపై కొట్టా. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు.
News February 3, 2026
VASTHU: చిన్న ఇల్లే చింతలేని ఇల్లు

పూర్వం ఉమ్మడి కుటుంబాలతో ఇళ్లు కళకళలాడేవి. కానీ నేడు పిల్లలు ఉద్యోగరీత్యా దూరమవ్వడంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ సులభంగా ఉండే చిన్న ఇల్లే స్వర్గమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. ‘ఓ పడకగది, వంటగది, హాల్‌తో కూడిన చిన్న ఇల్లు ఒంటరిగా ఉండేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఆ ఇల్లు వాస్తు ప్రకారం తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 3, 2026
మైతేయి-కుకీ హింస.. CM రిజైన్.. మణిపుర్‌లో ఏం జరిగింది?

మణిపుర్‌లో 2023 మేలో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 250 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాన్ని కంట్రోల్ చేయలేక, సొంత పార్టీ నేతల విమర్శల మధ్య 2025 Feb 9న అప్పటి CM బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో 2025 ఫిబ్రవరి 13 నుంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఏడాది తర్వాత నేడు BJP <<19041653>>కొత్త సీఎం<<>>ను ఎన్నుకుంది.


