News December 4, 2024
BIG BREAKING: మళ్లీ భూకంపం వచ్చే అవకాశం: NGRI
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని NGRI శాస్త్రవేత్త డా. శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు.
Share It
Similar News
News January 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
News January 19, 2025
100 మందిలో ఒకరికి క్యాన్సర్!
AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.
News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం
TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.