News July 15, 2024
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రమాణికంగా తీసుకోనుంది.
Similar News
News October 26, 2025
తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 26, 2025
కర్నూలు దుర్ఘటన.. చివరి నిమిషంలో బస్సెక్కి మృతి

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19వ వ్యక్తి చిత్తూరు(D)కు చెందిన త్రిమూర్తి అని తేలింది. ఆయన రిజర్వేషన్ లేకున్నా ఆరాంఘర్(HYD)లో బస్సెక్కారు. తన ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి DNA శాంపిల్స్ పరీక్షించగా చనిపోయింది త్రిమూర్తేనని తేలింది. TGకి చెందిన తరుణ్ రిజర్వేషన్ చేసుకున్నా చివరి నిమిషంలో బస్సెక్కకుండా ప్రాణాలు కాపాడుకోగా త్రిమూర్తిని మృత్యువు వెంటాడింది.
News October 26, 2025
నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

TG: రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ చేపట్టాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీటింగ్లో నిర్ణయించారు. NOV 1లోపు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని ఆ సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అటు HYDలో లెక్చరర్లతో భారీ బహిరంగ సభ, 10లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.


