News July 15, 2024
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రమాణికంగా తీసుకోనుంది.
Similar News
News October 4, 2024
సోదరి నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు: CM రేవంత్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్నిచ్చింది. తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహూకరించారు. ‘పేదరికాన్ని జయించి, సమానత్వాన్ని సాధించి, విశ్వక్రీడా వేదికపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరేసి, నేడు ప్రజా ప్రభుత్వంలో డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్‌కు హార్దిక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
News October 4, 2024
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ALERT
AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <
News October 4, 2024
1,497 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ
SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750(SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి <