News October 21, 2024
సుప్రీంలో గ్రూప్-1 అభ్యర్థులకు దక్కని ఊరట

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అంశంలో అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్షల రీషెడ్యూల్, జీవో 29 రద్దుపై గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం తిరస్కరించింది. ఇవాళ జరిగే పరీక్ష కోసం అభ్యర్థులు కేంద్రాల్లోకి వెళ్లారని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్‌ను కొట్టేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు నిరాకరించింది.
Similar News
News November 19, 2025
మార్నింగ్ ఫాగ్: నగరంలో హెల్మెట్, జాకెట్ ఇక పక్కా

శీతాకాలం తీవ్రత నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారులపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. వాహనదారులు లో-బీమ్ లైట్లు ఉపయోగించడం, సురక్షిత దూరం పాటించడం, ఓవర్‌టేక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బైకర్లు హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు.
News November 19, 2025
ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?.. సీవీ ఆనంద్ రిప్లై ఇదే!

TG: కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు’ అని పేర్కొన్నారు.