News March 31, 2024
BIG BREAKING: తప్పిన భారీ రైలు ప్రమాదం

TG: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. విచిత్రమైన శబ్ధం రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రైలును నిలిపివేసి పట్టా విరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. మరమ్మతులు చేసిన తర్వాత రైలు బయలు దేరింది. విరిగిన పట్టాను గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు చెప్పారు.
Similar News
News March 5, 2026
‘అస్థిర’ నేపాల్: 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు..

నేపాల్‌లో 2008లో రాచరిక పాలన అంతమయ్యాక ప్రచండ(నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ-మావోయిస్ట్) అధికారాన్ని చేపట్టారు. అయితే ఏడాదికే ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మార్కిస్ట్, నేపాలీ కాంగ్రెస్ నేతలు PM పీఠం చేపట్టారు. అవినీతి, పార్టీలకు మెజార్టీ లేకపోవడంతో 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. కేపీ ఓలీ సర్కార్ కూలిన తర్వాత ఇవాళ ఎన్నికలు జరిగాయి. విజేత ఎవరో రేపు <<19301003>>తేలనుంది.<<>>
News March 5, 2026
రాచరికం నుంచి రిపబ్లిక్ వరకు.. నేపాల్ హిస్టరీ ఇదే

శతాబ్దాలపాటు నేపాల్‌లో రాచరిక పాలన ఉండేది. 1960లో కింగ్ మహేంద్ర పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చారు. 1990లో రాజు బీరేంద్ర రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తేశారు. 1996లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) రాచరికాన్ని పడగొట్టడానికి తిరుగుబాటును ప్రారంభించింది. 2001లో బీరేంద్రను చంపేశారు. చివరికి 2008లో 240 ఏళ్ల రాచరిక పాలన రద్దై నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారింది.
News March 5, 2026
బిహార్‌లో తొలి బీజేపీ సీఎం.. రంగం సిద్ధం!

మోదీ నేతృత్వంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP అనేక రాష్ట్రాలపై పట్టు సాధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో బిహార్ కూడా చేరనుంది. సీఎం నితీశ్ RSకు వెళ్లనుండటంతో ఆయన స్థానంలో తొలిసారి <<19302367>>BJP నేత<<>> CM పీఠం ఎక్కే అవకాశం ఉంది. 2014 తర్వాత అస్సాంలో శర్బానంద, మణిపుర్‌లో బీరేన్‌సింగ్, త్రిపురలో బిప్‌లాబ్, హరియాణాలో మనోహర్, అరుణాచల్‌లో పెమా ఖండు, ఒడిశాలో మోహన్ BJP నుంచి తొలిసారి CMలు అయ్యారు.


