News April 7, 2025

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

image

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46, డీజిల్ ధర రూ.95.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.63, డీజిల్ ధర రూ.97.47గా కొనసాగుతోంది

Similar News

News April 13, 2025

ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్‌స్టన్’

image

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ ‘కింగ్‌స్టన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

News April 13, 2025

రేపు సెలవు

image

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్‌లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడేస్ రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చినట్లయింది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతోపాటు స్టాక్ మార్కెట్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.

News April 13, 2025

జలియన్ వాలాబాగ్.. స్వాతంత్ర్య పోరాటంలో మలుపు: మోదీ

image

జలియన్ వాలాబాగ్ అమరవీరులకు PM మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటమే మలుపు తిరిగిందని ట్వీట్ చేశారు. అమరవీరుల అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1919 APR 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు.

error: Content is protected !!