News April 7, 2025

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

image

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46, డీజిల్ ధర రూ.95.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.63, డీజిల్ ధర రూ.97.47గా కొనసాగుతోంది

Similar News

News April 22, 2025

AP న్యూస్ రౌండప్

image

* అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారీకి ADCL నిర్ణయం
* వచ్చే నెల 6 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
* మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి
* ఈ నెల 28న గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు.. వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ
* బోరుగడ్డ అనిల్‌పై అనంతపురంలో కేసు.. ఈ నెల 30కి విచారణ వాయిదా

News April 22, 2025

ALERT: కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 2 గంటల్లో మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో ఇవాళ రాత్రి వేడి, ఉక్కపోత నెలకొంటుందని తెలిపింది.

News April 22, 2025

అమర్‌నాథ్ యాత్రకు ముందు భారీ కుట్ర!

image

J&Kలో ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టూరిస్ట్ సీజన్ కావడం, జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సమయంలో ఈ కుట్రకు పాల్పడ్డారు. పహల్‌గామ్ సమీపంలోని బైసరీన్ వ్యాలీలో పెద్దఎత్తున టూరిస్టులు ఉండగా అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేదు. గుర్రాలపైనే వెళ్లాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి అమిత్ షా హుటాహుటిన అక్కడికి బయల్దేరారు.

error: Content is protected !!