News February 28, 2025
BIG BREAKING: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా

AP: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించామన్నారు.
Similar News
News March 26, 2025
YS జగన్ పెద్దమ్మ మృతి

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ(85) ఇవాళ పులివెందులలో కన్నుమూశారు. ఈమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.
News March 26, 2025
‘రాబిన్‌హుడ్’కి వార్నర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే, అతని పాత్ర స్క్రీన్ మీద 2 నిమిషాల 50 సెకన్లు ఉంటుందని సమాచారం. ఇందుకోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఆయన రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వార్నర్ తెలుగులో మాట్లాడి, డాన్స్ చేసి సందడి చేసిన విషయం తెలిసిందే.
News March 26, 2025
బెడ్‌రూమ్‌లో ఏ కలర్ లైట్ మంచిది?

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్‌రూమ్‌లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.