News June 12, 2024

ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే(1/2)

image

AP: 24 మందితో మంత్రివర్గ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి ఒక పదవి కేటాయించారు.
✒ పవన్ కళ్యాణ్, ✒ నారా లోకేశ్
✒ అచ్చెన్నాయుడు, ✒ కొల్లు రవీంద్ర,
✒ నాదెండ్ల మనోహర్(JSP), ✒ పి.నారాయణ,
✒ వంగలపూడి అనిత, ✒ సత్యకుమార్ యాదవ్(BJP)
✒ నిమ్మల రామా నాయుడు ✒ మహమ్మద్ ఫరూక్
✒ ఆనం రాంనారాయణ రెడ్డి, ✒ పయ్యావుల కేశవ్

Similar News

News March 18, 2025

భారత్ టెస్టుల్లో పేలవం.. రోహిత్‌దే బాధ్యత: గంగూలీ

image

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో బాగా ఆడుతున్నా టెస్టుల్లో పేలవమేనని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. ‘కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ బాధ్యత తీసుకోవాలి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడి సామర్థ్యానికి మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్టుల్లో గెలుపులపై రోహిత్ ముందుగానే ప్లాన్ వేయాలి. తెల్లబంతి ఫార్మాట్లలో మాత్రం అతడికి తిరుగులేదు’ అని కొనియాడారు.

News March 18, 2025

మందుబాబులకు గుడ్ న్యూస్!

image

TG: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త బీర్లు అమ్మేందుకు TGBCLకు దాదాపు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుంది. అన్ని పూర్తయితే ఏప్రిల్ నుంచి అమ్మకాలు జరిపేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.

News March 18, 2025

మహేశ్ బాబు ఔదార్యం.. ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్!

image

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.

error: Content is protected !!