News March 16, 2024

BIG BREAKING: ఏపీలో ఎన్నికల తేదీ ఇదే

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Similar News

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!

image

ఓరోజు తగ్గుతూ తర్వాతి రోజు పెరుగుతూ బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 9, 2025

మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

image

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.

News July 9, 2025

తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

image

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.