News January 2, 2025

సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.

Similar News

News January 26, 2025

కవులు, కళాకారులు తెలంగాణలో లేరా?: RSP ప్రశ్న

image

TG: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై BRS నేత RS ప్రవీణ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన మందకృష్ణ మాదిగ, డా.నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు చెబుతూనే కేంద్రంపై మండిపడ్డారు. సాహిత్యం, కళల రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. TGలో కవులు, కళాకారులు లేనే లేరా? కేవలం APలోనే ఉన్నారా? అంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలను ప్రశ్నించారు.

News January 26, 2025

పద్మకు ఎంపికైన వారికి CM అభినందనలు

image

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి CM రేవంత్ అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ సహా ఈ పురస్కారాలకు <<15260048>>తెలుగువారు <<>>ఎంపిక కావడంపై CM హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగాల్లో చేసిన కృషి, అంకితభావమే వారికి ఈ పురస్కారాలు దక్కేలా చేసిందని కొనియాడారు.

News January 26, 2025

విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం

image

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.