News August 3, 2024
మహా పరిణామాలు: షిండేతో శరద్ పవార్, రాజ్ ఠాక్రే చర్చలు
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. CM ఏక్‌నాథ్ షిండేను శరద్ పవార్, రాజ్‌ఠాక్రే (MNS) వేర్వేరుగా కలిశారు. రాజకీయంగా కీలకమైన మరాఠా రిజర్వేషన్లు, ఇంటి నిర్మాణ ప్రాజెక్టులపై వీరు చర్చించారు. LS ఎన్నికల్లో BJPకి మద్దతిచ్చిన ఠాక్రే చాలా సందర్భాల్లో షిండేను విమర్శిస్తున్నారు. ఇక MVA కూటమి నుంచి పవార్ ఒక్కరే షిండేను కలుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు వీరి చర్చలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News September 17, 2024
కొత్త రేషన్ కార్డుల అంశంపై ప్రజల్లో సందేహాలు
TG: రేషన్ కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.
News September 17, 2024
జానీని ‘మాస్టర్’ అని పిలవొద్దు: హీరోయిన్
డాన్స్ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆయన తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News September 17, 2024
నేడు సమీక్షలతో బిజీగా సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.