News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
వారానికి పైగా తల్లి, సోదరుడి శవాల మధ్య ఇంట్లోనే చిన్నారి

న్యూయార్క్(US)లోని ఓ ఇంట్లో తల్లి, సోదరుడు మృతిచెందగా నాలుగేళ్ల చిన్నారి శవాల మధ్యే వారానికి పైగా గడిపిన హృదయవిదారక ఘటన ఇది. లీసా(38), నాజిర్(8) అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే మరణించారు. లీసా కూతురు ప్రామిస్ ఆ మృతదేహాల మధ్యే ఉండిపోయింది. అసలేం జరిగిందో తెలియని ఆ చిన్నారి కొన్ని రోజులపాటు చాక్లెట్లు తింటూ సర్వైవ్ అయింది. లీసా సోదరి ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.
News April 20, 2025
‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్

తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్‌బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.
News April 20, 2025
తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటు

TG: నిర్మల్ జిల్లాలో తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటైంది. ఈ బృందాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘టీం శివంగి’ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మహిళా పోలీసులలోని ఔత్సాహికులకు 45 రోజుల కఠిన శిక్షణ ఇచ్చి కమాండో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయుధాలు, సాంకేతిక, తదితర అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.