News January 24, 2025

భారతీయులకు బిగ్ రిలీఫ్

image

అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్‌ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు USAకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.

Similar News

News February 16, 2025

నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత

image

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.

News February 16, 2025

త్వరలో మహిళలకు నెలకు రూ.2,500: CM

image

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.

News February 16, 2025

గజిబిజి అనౌన్స్‌మెంట్‌కు 18 మంది బలి!

image

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్‌మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్‌ఫామ్ నుంచి 16వ ప్లాట్‌ఫామ్‌కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.

error: Content is protected !!