News April 25, 2024

చెన్నై భారీ స్కోర్

image

LSGతో మ్యాచ్‌లో CSK బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ గైక్వాడ్ 108(60 బంతుల్లో) సెంచరీతో కదం తొక్కగా.. శివం దూబె 66(27బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. దీంతో చెన్నై 20ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసింది. రహానే(1), మిచెల్(11), జడేజా(16) విఫలమయ్యారు. ధోనీ 4(1) రన్స్ చేశారు.

Similar News

News January 20, 2025

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

image

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు మృతిచెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News January 20, 2025

సైఫ్ ఇంట్లో నేడు క్రైమ్ సీన్ రీక్రియేషన్?

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తారని సమాచారం. అతడిపై కత్తితో అటాక్ చేసిన షరీఫుల్‌ను UPలో అరెస్టు చేశారు. అతడిని ఇప్పటికే ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నేడు భారీ భద్రత నడుమ సైఫ్ ఇంటికి తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. నిందితుడు రెక్కీ, దాడికి ప్లాన్ చేసిన తీరును తెలుసుకోనున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తేలాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

News January 20, 2025

పైసా ప్రయోజనం లేకున్నా సొంత ఎలివేషన్లకు బాబు ఖర్చు: వైసీపీ

image

AP: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో ప్రముఖులతో మీటింగులంటూ ఫొటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారని వైసీపీ విమర్శించింది. వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కాలేదని దుయ్యబట్టింది. మరోసారి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత ఎలివేషన్లకు ఏమాత్రం కొదవ లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారని మండిపడింది.