News June 17, 2024
ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. 4కి 4 ఓవర్లు మెయిడిన్

ప్రపంచ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. NZ బౌలర్ ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. 4కి 4 ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. అంతేకాదు 3 వికెట్లూ పడగొట్టారు. అతడి గణాంకాలు 4-4-0-3గా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే. పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచులో కివీస్ పేస్ బౌలర్ ఈ రికార్డు అందుకున్నారు. గతంలో కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి, 2 వికెట్లు తీశారు.
Similar News
News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
News January 18, 2026
నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<


