News October 26, 2024
కరెంట్ బిల్లులు కట్టే వారికి BIG SHOCK

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా డిస్కంలకు ERC అనుమతి ఇచ్చింది. దాదాపుగా ₹6072.86 కోట్లను ప్రజలే భరించాల్సి ఉండగా యూనిట్‌కు ₹1.21 చొప్పున 15 నెలల పాటు వసూలు చేస్తారు. 2019-20, 20-21 సంవత్సరాలకు ఇంధన సర్దుబాటు కింద ₹1.05 చెల్లించిన ప్రజలు తాజా భారంతో కలిపి అదనంగా యూనిట్‌కు ₹2.26 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News March 18, 2025
ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?
News March 18, 2025
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
News March 18, 2025
క్రిమినల్ కేసుల్లో టీడీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం: ADR

దేశంలో క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. 134 మందికిగాను 115 మంది(86%)పై క్రిమినల్ కేసులు, 82 మంది(61%)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 638 మంది(39%)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(339/646)పై, 41% TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంది.