News November 6, 2024

మందుబాబులకు BIG SHOCK?

image

తెలంగాణలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 6, 2024

విద్యార్థులకు శుభవార్త

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఇకపై వరుసగా మూడేళ్లు రాయొచ్చు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రాసేందుకు అవకాశం ఉండగా, 2025లో నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్ష నుంచి మూడు సార్లు అటెంప్ట్ చేయొచ్చని కేంద్రం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2023లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ సారి పరీక్ష రాయవచ్చని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొంది.

News November 6, 2024

రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు: శ్రీకాంత్

image

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో విఫలమైతే రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పొచ్చని మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అతడి వయసు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కివీస్ సిరీస్‌లో ఆడలేదని రోహిత్ అంగీకరించడం గ్రేట్. అతను గాడినపడేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ విఫలమైతే అతడే తప్పుకుంటాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

News November 6, 2024

ట్రంప్ గెలిస్తే.. పాలనలో జోక్యంపై మస్క్ హింట్

image

డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ పాలనలో ఆయనకు సాయపడతానని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను కుదిస్తానని పేర్కొన్నారు. ‘మన బ్యూరోక్రసీ చాలా పెద్దది. పైగా మన దేశంలో నియంత్రణలు ఎక్కువ. వాటిని తగ్గించాల్సి ఉంది. అమెరికాను మరింత మెరుగ్గా నిర్మించేవాళ్లకు సాయపడాలి’ అని టక్కర్ కార్ల్‌సన్‌షోలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని మస్క్ నమ్మకంతో ఉన్నారు.