News August 14, 2024
లంకతో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆయన స్థానంలో ఒలీ పోప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో జరిగే పాకిస్థాన్ పర్యటనకు ఆయన అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా హండ్రెడ్ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టోక్స్‌కు చీలమండ గాయమైంది.
Similar News
News February 1, 2026
IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <
News February 1, 2026
మాఘ పౌర్ణమి: అద్భుత ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు

నేడు చేసే చిన్న సత్కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈరోజు గంగమ్మను, నారాయణుడిని స్మరిస్తూ పితృ తర్పణాలు వదలడం శుభప్రదం. దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే, సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన చేసే జప, హోమాలు సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
News February 1, 2026
ప్రెగ్నెన్సీలో ఎంతసేపు పడుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో తల్లికి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకోవడానికి వీలుగా పిల్లో వాడాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం మసాలాలున్న ఆహారాలు, కెఫీన్ వంటివి తగ్గించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందు చూడకపోవడమే మంచిది. కనీసం ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి తగినంత రక్తం, పోషకాలు అందుతాయని చెబుతున్నారు.


