News February 6, 2025
భారత్కు బిగ్ షాక్.. ఓపెనర్లు ఔట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (1*), శ్రేయస్ అయ్యర్ (12*) ఉన్నారు. కాగా భారత్ విజయానికి ఇంకా 218 పరుగులు అవసరం.
Similar News
News February 6, 2025
ప్రయాగ్రాజ్లో హరీశ్ రావు దంపతులు
TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
AP: సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.