News October 15, 2024

టీమ్ఇండియాకు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ ప్రెస్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ‘ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీని తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అతని మోకాళ్లలో వాపు వచ్చింది. ప్రస్తుతం NCAలో వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు. కోలుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు’ అని చెప్పారు.

Similar News

News November 11, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు గుర్తించారు.

News November 11, 2024

15న ఓటీటీలోకి కొత్త చిత్రం

image

సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 11న <<14329220>>విడుదలైన<<>> ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

News November 11, 2024

AP: డిసెంబర్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

తూ.గో.- ప.గో. జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లకు రేపటి నుంచి ఈ నెల 18 వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, డిసెంబర్ 5న ఎన్నిక నిర్వహించనున్నారు. 2023 డిసెంబరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక జరుగుతోంది.