News February 21, 2025
బైకులు, కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?

20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా 20 ఏళ్లు పైబడిన టూ వీలర్ కోసం ₹2వేలు, త్రీ వీలర్ కోసం ₹5వేలు, కార్లు ₹10వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు ₹25వేలు, హెవీ వెహికల్స్‌కు ₹36వేలు వసూలు చేయనుంది. అలాగే 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు ₹12వేలు, హెవీ వాటికి ₹18,000 వసూలుకు ప్రతిపాదించింది.
Similar News
News March 23, 2025
ఎప్పుడూ నైటీలో ఉండమంటున్నారు.. ఓ భార్య ఫిర్యాదు!

భర్త, అత్తమామలు తనను రోజంతా నైటీయే వేసుకుని ఉండాలని వేధిస్తున్నారంటూ అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ(21) పోలీసుల్ని ఆశ్రయించారు. 2023 మేలో పెళ్లైందని, అప్పటి నుంచీ అత్తింటి కుటుంబం వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త మద్యానికి బానిసై హింసిస్తున్నారని, అతడికి అత్తామామలు అండగా ఉన్నారని తెలిపారు. కలిసుండేందుకు తాను ప్రయత్నించినా భర్త వదిలేశారని, అతడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News March 23, 2025
కష్టాల్లో ముంబై.. 6 వికెట్లు డౌన్

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ ముగిసే సరికి 6వికెట్లు కోల్పోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా సాగుతోంది. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు ముంబై కష్టపడుతోంది. నూర్ 3, ఖలీల్ 2 వికెట్లు తీశారు. రోహిత్(0), రికెల్టన్(13), జాక్స్(11), సూర్య(29), తిలక్ వర్మ(31), రాబిన్(3) ఔటయ్యారు. 13 ఓవర్లకు MI స్కోర్ 96/6గా ఉంది.
News March 23, 2025
ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.