News January 24, 2025
రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్బాల్ స్టార్ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.


