News January 24, 2025

రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Similar News

News February 12, 2025

తగ్గిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.

News February 12, 2025

బర్డ్ ఫ్లూ అంటే?

image

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.

News February 12, 2025

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

image

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!