News March 28, 2024

బీఆర్ఎస్‌కు BIG SHOCK

image

BRSకు మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు BRS అభ్యర్థి కడియం కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం విషయాలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేను’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

మే 17న JEE అడ్వాన్స్‌డ్

image

JEE అడ్వాన్స్‌డ్-2026 తేదీని IIT రూర్కీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. 9AM నుంచి 12PM వరకు పేపర్-1, 2.30PM నుంచి 5.30PM వరకు పేపర్-2 ఉంటాయని వెల్లడించింది. పూర్తి షెడ్యూల్‌ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. JEE మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్‌లో జరగనున్నాయి.

News December 6, 2025

ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

image

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.

News December 6, 2025

శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

image

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.