News November 8, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు లభించినట్లు సమాచారం. ఇక ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రారని, ఈ కేసు విచారణకు బ్రేక్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
Similar News
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 17, 2025
భారత్‌పై పాకిస్థాన్ విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.


