News November 8, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్?
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు లభించినట్లు సమాచారం. ఇక ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రారని, ఈ కేసు విచారణకు బ్రేక్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
Similar News
News December 8, 2024
కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు
AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
News December 8, 2024
సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు
NDA ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థలు, జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ హస్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.
News December 8, 2024
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!
‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.