News March 5, 2025
సింగర్ కల్పన కేసులో బిగ్ ట్విస్ట్

కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయలేదని KPHB పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఇంట్లో చిన్న గొడవలతో నిద్రపట్టక అధిక మోతాదులో స్లీపింగ్ పిల్స్ వేసుకున్నట్లు ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందన్నారు. కాగా తన కూతురు కేరళ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యేందుకు ఒప్పుకోకపోవడంతో చనిపోవాలని భావించానని కల్పన చెప్పినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమె <<15659208>>కూతురు<<>> ఖండించగా తాజాగా పోలీసులూ క్లారిటీ ఇచ్చారు.
Similar News
News March 18, 2025
స్త్రీ2, పుష్ప-2ను అధిగమించిన ఛావా

‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు (₹22cr) సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹16cr), పుష్ప-2 (₹14cr) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65crకు పైగా రాగా, ప్రపంచ వ్యాప్తంగా ₹750.5crకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
News March 18, 2025
మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.
News March 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 18, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.