News April 5, 2024
‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్ చేసింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్‌లెస్‌గా చూపించారని, ‘పుష్ప-2’లో బ్యూటిఫుల్‌గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Similar News
News December 7, 2025
శని దోషాలు ఎన్ని రకాలు?

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.
News December 7, 2025
21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్

AP: రాష్ట్రంలో 21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు CS విజయానంద్ తెలిపారు. ‘7.48 లక్షల SC, ST వినియోగదారుల ఇళ్లపైనా 2 కిలోవాట్ల చొప్పున 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సెట్లను అమర్చాలి. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ సిస్టమ్స్, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చిలోగా ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు సూచించారు.
News December 7, 2025
రైతులకు అలర్ట్.. పంటల బీమా చెల్లించారా?

AP: PM ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. రబీకి సంబంధించి DEC 15లోపు టమాటా, వేరుశనగ, 31లోపు వరి సాగు చేసే రైతులు ప్రీమియం కట్టాలి. మామిడి రైతులకు JAN 3వరకు గడువుంది. భూమిపత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, కామన్ సర్వీస్ ఇన్యూరెన్స్ పోర్టల్‌లో బీమా కట్టొచ్చు. పంట రుణాలున్న రైతులు నేరుగా బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించొచ్చు.


