News April 5, 2024
‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్ చేసింది. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్‌లెస్‌గా చూపించారని, ‘పుష్ప-2’లో బ్యూటిఫుల్‌గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Similar News
News April 18, 2026
KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News April 18, 2026
పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News April 18, 2026
మహిళా బిల్లును ప్రవేశపెట్టిన DMK

డీలిమిటేషన్‌కు లింక్ చేసి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు నిన్న వీగిపోయిన నేపథ్యంలో NDAకు కౌంటర్‌గా రాజ్యసభలో DMK ఈరోజు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్, సెన్సస్ అవసరం లేకుండా 543 లోక్‌సభ స్థానాల్లోనే 33% మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు, UTలైన పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ సహా ఢిల్లీ NCRకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సీట్లను, నియోజకవర్గ పరిధులను మార్చాల్సిన అవసరం లేదంది.


