News September 29, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్లపై BIG UPDATE

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.
Similar News
News November 16, 2025
గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.
News November 16, 2025
టీమ్ ఇండియా చెత్త రికార్డు

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.
News November 16, 2025
అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్‌కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.


