News September 29, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్లపై BIG UPDATE

image

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.

Similar News

News October 7, 2024

మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి

image

మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

News October 7, 2024

అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు

image

1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1900: తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం
1940: పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం
1979: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం

News October 7, 2024

నోర్మూసుకుని కూర్చో: కమెడియన్‌తో ఓలా సీఈఓ

image

ఓలా బైక్స్‌ను విమర్శిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్‌పై ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్ మండిపడ్డారు. అంత బాధగా ఉంటే వచ్చి హెల్ప్ చేయాలని సూచించారు. ‘వచ్చి మాకు సాయం చేయండి. మీ పెయిడ్ ట్వీట్ లేదా మీ విఫల కెరీర్ వల్ల మీకొచ్చేదాని కంటే ఎక్కువ జీతం ఇస్తా. లేదంటే నోర్మూసుకుని కూర్చోండి. నిజమైన వినియోగదారుల కోసం సమస్యల్ని సరిచేయనివ్వండి. మా సేవల్ని మరింత విస్తరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.