News September 28, 2024

కొత్త రేషన్‌కార్డులపై BIG UPDATE

image

TG: అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోనే సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పలువురు రేషన్ కార్డుల అర్జీలు సమర్పించేందుకు రావడంతో మంత్రి ఉత్తమ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

Similar News

News January 22, 2026

IITRలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్‌(IITR) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు LMV&HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా.. డ్రైవర్ పోస్టుకు 27ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: csiriitrprograms.in

News January 22, 2026

వసంత పంచమి ఎందుకు జరుపుకొంటారు?

image

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంతి పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వాగీశ్వరి జయంతి’గా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ ఇది.

News January 22, 2026

ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు పెట్టరా?

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. చివరగా 2024 అక్టోబర్‌లో ఇక్కడ భారత్-బంగ్లాదేశ్ టీ20 జరిగింది. చివరి వన్డే 2023 WCలో, చివరి టెస్టు 2024 జనవరిలో జరిగాయి. అదే సమయంలో వైజాగ్ స్టేడియం మహిళల ప్రపంచకప్‌తో పాటు చాలా మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 కూడా అక్కడే జరగనుంది. దీంతో హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.