News September 28, 2024

కొత్త రేషన్‌కార్డులపై BIG UPDATE

image

TG: అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోనే సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పలువురు రేషన్ కార్డుల అర్జీలు సమర్పించేందుకు రావడంతో మంత్రి ఉత్తమ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

Similar News

News October 15, 2024

SMATలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ తొలగింపు

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఈ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను అమలు చేస్తుండగా, 2023 సీజన్ నుంచి ఐపీఎల్‌లోనూ ప్రవేశ పెట్టారు. 2027 వరకూ దీనిని కొనసాగించనున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ ఈ రూల్‌ను తొలగించాలని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

News October 15, 2024

వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874: నాబార్డు

image

TG: రాష్ట్రంలో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు నాబార్డు తెలిపింది. మిగతా 45% శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి ఉందని తెలిపింది. వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 ఉండగా, నెలవారీ ఖర్చు రూ.13,093గా ఉంది. తగినంత ఆదాయం లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చి, ఉద్యోగాలు చేసుకుంటున్నాయని వెల్లడించింది.

News October 15, 2024

అకౌంట్‌లోకి రూ.16 లక్షలు.. తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష

image

భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్‌కు సింగపూర్‌లో 9 వారాల జైలు శిక్ష పడింది. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన డబ్బులు తిరిగివ్వనందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. ఓ మహిళ తాను పనిచేసే సంస్థలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించే క్రమంలో అతని అకౌంట్‌కు పంపింది. ఆ డబ్బు తనది కాదని తెలిసినా అతను తన అప్పులు తీర్చి, కుటుంబానికీ కొంత పంపాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు.