News November 3, 2024

ఉచిత సిలిండర్‌‌పై BIG UPDATE

image

AP: ఉచిత సిలిండర్ పథకానికి అర్హతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అధికారులు సమాధానాలిచ్చారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే లబ్ధి పొందగలరని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్నా పథకం వర్తిస్తుంది. ఇక గ్యాస్ రాయితీ పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి.

Similar News

News December 5, 2024

IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

News December 5, 2024

నేడు ప్రోబా-3 ప్రయోగం

image

AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్‌ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.

News December 5, 2024

EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు

image

AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.