News August 8, 2024
స్మార్ట్ ఫోన్ యూజర్లకు బిగ్ వార్నింగ్

ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12L, 13, 14 వాడుతున్న స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరించింది. వీటిలో హానికర మాల్వేర్ను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల ఫోన్లు హ్యాకై, వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వెంటనే ఆండ్రాయిడ్ వెర్షన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News November 27, 2025
ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.
News November 27, 2025
ముంపును తట్టుకొని అధిక దిగుబడి అందించిన వరి రకాలు

ఇటీవల మెుంథా తుఫానుకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. కానీ ఈ తీవ్ర తుఫాన్‌ను ఎదుర్కొని మంచి దిగుబడినిచ్చాయి R.G.L- 7034, M.T.U-1232 వరి రకాలు. తీవ్ర గాలులు, వరద ముంపు, అనంతర చీడపీడలను తట్టుకొని ఈ 2 వరి రకాలు ఆశించిన దిగుబడినిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తక్కువ ఎరువుల మోతాదుతో అధిక దిగుబడినిచ్చే ఈ వరి వంగడాల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 27, 2025
నాయకుల ‘ఏకగ్రీవ’ ప్రకటనలు.. ఓటుకు విలువ లేదా?

TG: పంచాయతీ ఎన్నికల వేళ నాయకుల ఆఫర్లు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తమ పార్టీ వ్యక్తి సర్పంచ్‌గా ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి ₹10L-30L ఇస్తామంటున్నారు. అయితే ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులివ్వరా? ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ ఓటుకు విలువ లేదా? ‘పెద్దలు’ ఏకమై ఏకగ్రీవాలు చేసుకుంటే.. తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరేమంటారు?


