News November 25, 2024
మహా విజయం: నిఫ్టీ 300+ గ్యాప్అప్ ఓపెనింగ్?
మహారాష్ట్రలో BJP+ కూటమి ఘన విజయంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. NSE నిఫ్టీ 300-400, BSE సెన్సెక్స్ 1500-2000 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ఓపెనవుతాయని అంటున్నారు. వ్యాపార, వాణిజ్యానికి కీలకమైన MHలో BJP గెలుపు ప్రభుత్వ పాలసీల్లో సుస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్తున్నారు. గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్లు పెరగడం సానుకూల సంకేతాలు పంపిందని అంటున్నారు.
Similar News
News December 5, 2024
కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది: పరిశోధకులు
కొవిడ్ బాధితుల తలలో ఆ వైరస్ కనీసం నాలుగేళ్లు ఉంటుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్’ అనే జర్నల్‌లో ఆ వివరాలను ప్రచురించారు. ‘మెదడులోని పొరల్లో వైరస్ తాలూకు స్పైక్ ప్రొటీన్ ఉండిపోతుంది. దీంతో నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడు పనితీరు వేగంగా మందగిస్తుంది. కొవిడ్ బాధితుల్లో 5 నుంచి 10శాతం రోగుల్లో అస్వస్థత కనిపిస్తుంది’ అని వివరించారు.
News December 5, 2024
‘పుష్ప-2’: పబ్లిక్ టాక్
‘పుష్ప-2’ ప్రీమియర్స్ చూసిన అభిమానుల నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్టులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు. WAY2NEWS రివ్యూ రేపు ఉదయం.
News December 4, 2024
చైతూ-శోభిత పెళ్లి ఫొటోలు
నాగచైతన్య-శోభిత వివాహం వైభవంగా జరిగింది. ఆ ఫొటోలను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. వారిద్దరూ కొత్త జీవితం ప్రారంభించడం సంతోషంగా, ఎమోషనల్‌గా ఉందని తెలిపారు. చైకి శుభాకాంక్షలు చెబుతూ తమ ఫ్యామిలీలోకి శోభితకు వెల్‌కమ్ చెప్పారు. ఆమె తమ కుటుంబంలోకి ఆనందాన్ని తీసుకొచ్చారని నాగార్జున రాసుకొచ్చారు. తన తండ్రి ANR శతజయంతి వేడుకల గుర్తుగా ఆయన విగ్రహం ముందే ఈ వివాహం జరగడం మరింత ప్రత్యేకమని వెల్లడించారు.