News April 28, 2024
దుబాయ్‌లో అతిపెద్ద విమానాశ్రయం.. త్వరలో నిర్మాణం

దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹2.9లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 5 సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దాని కంటే కొత్తది 5 రెట్లు పెద్దగా ఉండనుందట. ఏడాదికి 260M మంది ప్రయాణించేలా నిర్మిస్తున్నారట.
Similar News
News April 14, 2026
అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

హిట్టర్ అభిషేక్ శర్మకు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.
News April 14, 2026
IEBలో 28 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్(IEB), ముంబైలో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ-22, డిప్యూటీ మేనేజర్-5, చీఫ్ మేనేజర్-1 పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB/BE/B.Tech/PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం www.eximbankindia.in చూడండి.
News April 14, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.


