News February 7, 2025
ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.
Similar News
News March 24, 2026
HYDలో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదు: CP

TG: హైదరాబాద్‌లో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో బంకులు, ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీ పెంచవద్దని కోరారు. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన ‘X’ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలని ఆయన సూచించారు.
News March 24, 2026
SRHకు శుభవార్త.. నేడే బెంగళూరుకు కమిన్స్

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి నుంచి కోలుకున్నారు. దీంతో IPLలో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించిందని క్రిక్‌బజ్ వెల్లడించింది. ఆయన ఇవాళే బెంగళూరుకు చేరుకొని జట్టుతో కలుస్తారని తెలిపింది. ఈ నెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే పేసర్ <<19460349>>ఎషాన్ మలింగాకు<<>> శ్రీలంక బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కమిన్స్ రాకతో SRH బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
News March 24, 2026
చర్చలు విఫలం.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి

TG: రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చేసిన బుజ్జగింపులు విఫలమయ్యాయి. తాను ఏ డిమాండ్లను పీసీసీ ముందు పెట్టలేదని, తన సమస్యకు అధిష్ఠానం వద్ద పరిష్కారం లేదని తెలిపారు. పార్టీ మారొద్దని పీసీసీ చీఫ్ కోరారు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు.


