News February 7, 2025

ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

image

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.

Similar News

News February 8, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలై లామా పేరు!

image

లైంగిక నేరగాడు <<19009352>>ఎప్‌స్టీన్ ఫైల్స్‌<<>>లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో దలై లామాను లింక్ చేయాలని కొన్ని మీడియా సంస్థలు, SM హ్యాండిల్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎప్‌స్టీన్‌ను ఆయన ఎన్నడూ కలవలేదు. సమావేశం కాలేదు. అతడితో మాట్లాడలేదు’ అని స్పష్టంచేసింది.

News February 8, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ISSA) 21 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech(CS), డిప్లొమా(CS), MSc(మ్యాథ్స్), అర్హతగల వారు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను hrd.issa@gov.inకు ఈ -మెయిల్ చేయాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 8, 2026

SRK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘కింగ్’ తర్వాత రెండేళ్లు సెలవు?

image

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అప్ కమింగ్ మూవీ ‘కింగ్’ రిలీజ్ తర్వాత ఆయన రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వరుస షూటింగ్స్, స్టంట్స్ వల్ల భుజం గాయంతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుండటమే దీనికి కారణం. బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హెల్త్ సెట్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘కింగ్’ తర్వాత స్క్రీన్‌పై SRKని చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.