News December 31, 2024
బిగ్గెస్ట్ చోరీ: రూ.111కోట్ల నగలు కొట్టేసిన దొంగ
DEC 7న UK చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం జరిగింది. లండన్‌లోని ఓ రాజభవనంలోకి ప్రవేశించిన ఓ దొంగ రూ.111కోట్ల విలువైన నగలు, రూ.1.6 కోట్ల బ్యాగులు, రూ.16 లక్షల నగదు కొట్టేశాడు. అతడిని పట్టిస్తే రూ.5 కోట్లు, రికవరీ చేసినదాంట్లో10% బహుమానం ఇస్తామని యజమాని ప్రకటించారు. 13 బెడ్రూములుండే ఈ 5 అంతస్తుల భవనంలో కుటుంబీకులు, పనివాళ్లు సహా 8 మంది ఉండగానే 19 నిమిషాల్లో దొంగతనం జరిగినట్టు CCTVల్లో రికార్డైంది.
Similar News
News January 20, 2025
కాసేపట్లో ప్రమాణం.. చర్చిలో ట్రంప్ ప్రార్థనలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మెలానియా దంపతులు సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్-ఉష దంపతులు కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం రా.10.30 గంటలకు ట్రంప్, వాన్స్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
News January 20, 2025
నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
News January 20, 2025
J&K ఎన్‌కౌంటర్: భారత జవాన్ వీరమరణం
J&Kలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్‌లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.