News June 19, 2024

బిహార్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

image

బిహార్‌లో ప్రారంభించక ముందే కుప్పకూలిన బ్రిడ్జి <<13463723>>ఘటన<<>>పై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం స్పందించింది. ఆ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిందని స్పష్టం చేసింది. దీంతో పలువురు కేంద్ర మంత్రిపై విమర్శలకు దిగారు. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని గుర్తు లేదా అని కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News March 31, 2026

రేపటి నుంచి జరిగే మార్పులివే!

image

☛ ఇకపై OTPతో డిజిటల్ చెల్లింపులు చేయలేం. ప్రతి ట్రాన్సాక్షన్‌కి PIN/Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి ఏవైనా 2 కావాలి.
☛ దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌ తప్పనిసరి.
☛ KYC చేయని ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి.
☛ కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి.
☛ ఇక నుంచి అన్ని కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలి.

News March 31, 2026

నోట్‌బుక్ సెలబ్రేషన్స్.. ఈసారీ తగ్గేదేలే: దిగ్వేశ్ రాఠీ

image

గతేడాది IPLలో నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో వార్తల్లో నిలిచిన LSG స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ గుర్తున్నారా? ఈ సీజన్‌లోనూ తన తీరును మార్చుకొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేనెవరినీ అవమానించడం లేదు. బ్యాటర్ సెంచరీ చేశాక హెల్మెట్‌ను బ్యాట్‌పై పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొంటారు. నేనూ ఇంతే. నన్నెవరూ ఆపలేరు. కెప్టెన్ రిషభ్ సపోర్ట్ నాకుంది. బ్యాన్ పడకుండా చూసుకోమని మాత్రమే ఆయన సూచించారు’ అని పేర్కొన్నారు.

News March 31, 2026

విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు లేఖ!

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధర బ్యారెల్ $99.40 నుంచి $195.19కి చేరింది. కంపెనీలు రేపు ఈ రేట్లను మరోసారి సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు సమాచారం. ‘ఢిల్లీలో VAT 25%, మహారాష్ట్రలో 18%, TNలో 29% ఉంది. వీటిని తగ్గిస్తే విమాన టికెట్లపై భారం పడదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.