News July 19, 2024
ఫిల్మ్ ప్రమోషన్ పాలసీకి బిహార్ గ్రీన్ సిగ్నల్
ఫిల్మ్ ప్రమోషన్ పాలసీకి బిహార్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇది మూవీ మేకర్స్‌కు ఆర్థిక తోడ్పాటునివ్వనుంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా తీసే ప్రాంతీయ సినిమాకు రూ.4కోట్ల వరకు ఆర్థిక సాయం అందించనుంది. సీఎం నితీశ్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో సినిమాలు తీసేందుకు అద్భుతమైన లొకేషన్లు, సదుపాయాలున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News December 1, 2024
132 ఏళ్ల సీసాలో సందేశం.. ఇప్పుడు దొరికింది!
132 ఏళ్ల క్రితం గాజు సీసాలో పెట్టిన సందేశమది. స్కాట్లాండ్‌లోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్ పనితీరును ఓ మెకానికల్ ఇంజినీర్ సమీక్షిస్తుండగా గోడల్లో బయటపడింది. 1892, సెప్టెంబరు 4న ఆ లైట్‌హౌస్‌ను నిర్మించిన ముగ్గురు ఇంజినీర్లు తమ పేర్లను, ముగ్గురు సిబ్బంది పేర్లను రాసిన కాగితాన్ని సీసాలో పెట్టి గోడలో భద్రపరిచారు. అది ఇన్నేళ్లకు వెలుగుచూసింది. దాన్ని కనుగొన్న అధికారులు వారూ ఓ సీసాను పెట్టాలనుకుంటున్నారు.
News December 1, 2024
BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్
దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
News December 1, 2024
రేపు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.