News September 13, 2024
బిన్ లాడెన్ కొడుకు బతికే ఉన్నాడు: ఇంటర్నేషనల్ మీడియా

ఒసామా బిన్‌లాడెన్ కొడుకు హంజా బిన్‌లాడెన్ బతికే ఉన్నాడని ‘ది మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఒసామాను 2011లో US దళాలు హతమార్చగా, 2019 వైమానిక దాడిలో హంజా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతను 450 మంది స్నైపర్స్ రక్షణలో అఫ్గాన్‌లో ఉన్నాడని, రహస్యంగా అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది. తాలిబన్లు అధికారం చేపట్టాక ఉగ్రసంస్థలకు శిక్షణ కేంద్రంగా కాబుల్ మారిందని పేర్కొంది.
Similar News
News December 8, 2025
రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

TG: పార్లమెంటు సభ్యులపై <<18438395>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. బ్రిజ్‌లాల్, గోపాలస్వామి ఆమెపై రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇటీవల ఆమె పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను ఉద్దేశిస్తూ కరిచే వాళ్లు లోపల ఉన్నారని వ్యాఖ్యానించారు.
News December 8, 2025
రూ.500 కోట్ల కామెంట్స్.. కాంగ్రెస్ నుంచి సిద్ధూ భార్య సస్పెండ్

సీఎం పోస్ట్ కొనుక్కోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి పంజాబ్ కాంగ్రెస్ తొలగించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అమరిందర్ సింగ్ తెలిపారు. కాగా ఆమె వ్యాఖ్యలు పంజాబ్‌లో తీవ్ర దుమారం రేపడంతో తన కామెంట్స్‌ను వక్రీకరించారని కౌర్ అన్నారు.
News December 8, 2025
3,131 ఉద్యోగాలు.. BIG UPDATE

SSC CHSL-2025 టైర్-1 ఆన్లైన్ పరీక్షల కీ విడుదలైంది. అభ్యర్థులు https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌తో లాగినై కీ, రెస్పాన్స్‌షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి అభ్యంతరాలను తెలపవచ్చు. కాగా 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


