News September 13, 2024
బిన్ లాడెన్ కొడుకు బతికే ఉన్నాడు: ఇంటర్నేషనల్ మీడియా
ఒసామా బిన్‌లాడెన్ కొడుకు హంజా బిన్‌లాడెన్ బతికే ఉన్నాడని ‘ది మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఒసామాను 2011లో US దళాలు హతమార్చగా, 2019 వైమానిక దాడిలో హంజా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతను 450 మంది స్నైపర్స్ రక్షణలో అఫ్గాన్‌లో ఉన్నాడని, రహస్యంగా అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది. తాలిబన్లు అధికారం చేపట్టాక ఉగ్రసంస్థలకు శిక్షణ కేంద్రంగా కాబుల్ మారిందని పేర్కొంది.
Similar News
News October 14, 2024
రేపటి నుంచి స్కూళ్లు
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటితో దసరా సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాలేజీలు మాత్రం నేటి నుంచే తెరుచుకోనున్నాయి. అటు ఏపీలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 2 నుంచి 13 వరకు దసరా సెలవుల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకానున్నారు. కాగా ఇంటర్ కాలేజీలను ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నారు.
News October 14, 2024
కాల్పులకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి నార్త్ కొరియా ఆదేశాలు
దక్షిణ కొరియా తమ దేశంలోకి డ్రోన్లను పంపిస్తోందని ఆరోపిస్తూ తమ సైన్యాన్ని నార్త్ కొరియా సమాయత్తం చేసింది. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా వెంటనే కాల్చేయాలని స్పష్టం చేసింది. తమ అధినేత కిమ్‌ను విమర్శించే పార్సిళ్లను దక్షిణ కొరియా పంపుతోందని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణల్ని సియోల్ కొట్టిపారేస్తోంది. వాటిని తాము పంపడం లేదని తేల్చిచెబుతోంది.
News October 14, 2024
J&Kలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.