News May 23, 2024
పక్షి ఈక రూ.23 లక్షలు

న్యూజిలాండ్‌లో అంతరించిపోయిన huia bird ఈక రికార్డు ధర పలికింది. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువున్న ఈకను వేలానికి పెట్టగా ఏకంగా రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది బంగారం కన్నా విలువైనది కావడంతోనే భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ హుయా పక్షులు 1907లో చివరి సారి కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికినే కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయట.
Similar News
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT
News April 18, 2026
రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.
News April 18, 2026
ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి వల్ల స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడమే కాకుండా వాటి పనితీరూ నెమ్మదిస్తోంది. ఓవర్ హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలొస్తుంటాయి. వీటిని నివారించేందుకు ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


