News February 15, 2025

బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

image

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Similar News

News November 12, 2025

పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఉండాలి: కాజోల్

image

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలని అన్నారు. ‘సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని ఏంటి నమ్మకం? అందుకే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు’ అని చెప్పారు. తాను, ట్వింకిల్ ఖన్నా కలిసి నిర్వహిస్తున్న టాక్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాజోల్ కామెంట్స్‌పై మీరేమంటారు?

News November 12, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్.. ఫైనల్ లెక్క ఇదే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.