News February 15, 2025
బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Similar News
News March 23, 2025
ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.
News March 23, 2025
పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్‌ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.
News March 23, 2025
కూటమి సర్కార్ నాపై కక్షగట్టింది: విడదల రజిని

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.